వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్‌కు సీబీఐ హెచ్చరిక

by Disha Web |
వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్‌కు సీబీఐ హెచ్చరిక
X

దిశ, ఏపీ బ్యూరో : వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు సీబీఐ మరోసారి నోటీసులు అందజేసింది. బాపట్ల జిల్లా ఎస్పీ కార్యాలయంలో శనివారం ఆమంచి కృష్ణమోహన్ సీబీఐ అధికారులను కలిశారు. ఈ సందర్భంగా సీబీఐ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తాము సూచించిన రోజే విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీసుల్లో పేర్కొంది. అయితే ఎప్పుడు విచారణకు హాజరుకావాలో త్వరలో వెల్లడిస్తామని తెలిపింది.

ఇకపోతే సోషల్ మీడియాలో న్యాయ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్‌కు సీఆర్పీసీ 41ఏ కింద సీబీఐ నోటీసులు జారీ చేసింది. గతంలో ఆమంచి కృష్ణమోహన్ విశాఖపట్నంలోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. అయితే ఈనెల 21న విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీసులు జారీ చేయగా తాను హాజరుకాలేనని చెప్పుకొచ్చారు. ముందుగా నిర్ణయించుకొన్న కార్యక్రమాల నేపథ్యంలో విచారణకు హాజరుకాలేనని వారం రోజులు సమయం ఇస్తే హాజరవుతానని సీబీఐకు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఇకపై తాము ఎప్పుడు చెప్తే అప్పుడు విచారణకు హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed