కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షునికిగా ''ముకుల్ వాస్నిక్''..?

by Mahesh |
కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షునికిగా ముకుల్ వాస్నిక్..?
X

దిశ, వెబ్ డెస్క్: ఇటివల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఓటమి తరువాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అత్యున్నత స్థాయి సమావేశం ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు జరగనున్నట్లు సమాచారం. అలాగే ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నూతన అద్యక్షుడిని కూడా ప్రకటిస్తారనే వార్తా జోరుగా ప్రచారం అవుతుంది. ప్రస్తుతం సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్నారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. G-23 నాయకులు, కపిల్ సిబల్, గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ వంటి అసమ్మతి నాయకులు అంతా ముకుల్ వాస్నిక్ పెరును సూచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే రాహుల్ పార్టీ అధ్యక్షుడు కాకపోయినా.. అతను తెరవెనుక ఉండి అన్ని నిర్ణయాలు తీసుకుంటాడు అనే వాదన కూడా ఉంది. ఈ నేపధ్యంలోనే పార్టీకి అనుభవజ్ఞులైన వారిని పార్టీ అధ్యక్షుడిగా నిర్ణయించాలి అనేది సీనియర్ల వాదనగా వినిపిస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

Next Story

Most Viewed