ఈశా అంబానీకి రిలయన్స్ రిటైల్ బాధ్యతలు అప్పగించే అవకాశం..!

by Disha Web |
ఈశా అంబానీకి రిలయన్స్ రిటైల్ బాధ్యతలు అప్పగించే అవకాశం..!
X

ముంబై: దేశీయ అతిపెద్ద సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ తన వారసులకు బాధ్యతలను అప్పగించే ప్రక్రియను ప్రారంభించారు. మంగళవారం ఆయన తనయుడు ఆకాశ్ అంబానీకి టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన కుమార్తె ఈశా అంబానీకి రిలయన్స్ రిటైల్ బాధ్యతలను బదిలీ చేయనున్నట్టు పలు నివేదికలు అభిప్రాయపడ్డాయి. దీనికి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడుతుందని అంచనా వేస్తున్నాయి.

ఇప్పటికే ఈశా అంబానీ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్, జియో బోర్డులో డైరెక్టర్‌గా ఉన్నారు. 2016లో రిలయన్స్ రిటైల్ అనుబంధంగా అజియో ఫ్యాషన్ రిటైల్‌ను ప్రారంభించారు. కాగా, ముంబైలోని ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదివిన ఈశా అంబానీ అనంతరం అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఏల్ యూనివర్శిటీ నుంచి సైకాలజీ, సౌత్ ఏషియన్ స్టడీస్ నుంచి బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యూయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీయే చేశారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed