దేశంలో తొలికేసు : TS సర్కార్ అలర్ట్.. సికింద్రబాద్‌లో నేటి నుంచి మంకీ పాక్స్ టెస్టులు

by Dishanational2 |
దేశంలో తొలికేసు : TS సర్కార్ అలర్ట్.. సికింద్రబాద్‌లో నేటి నుంచి మంకీ పాక్స్ టెస్టులు
X

దిశ, వెబ్‌డెస్క్ : ఇప్పటికే కరోనాతో ప్రపంచం అతలాకుతలం కాగా మరో వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తుంది. పలు దేశాల్లోని ప్రజలను కలవరపరస్తున్న మంకీపాక్స్ తాజాగా భారత దేశానికి పాకింది. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సికింద్రబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో శనివారం(ఈరోజు ) నుంచి మంకీపాక్స్ టెస్టులు చేయనున్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన ల్యాబ్‌లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఇక్కడ సేకరించిన శాంపిల్స్‌ను పుణె ల్యాబ్‌కు పంపనున్నట్లు సమాచారం.

కాగా ఇప్పటికే మంకీపాక్స్ 50 దేశాలకు విస్తరించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇక మన దేశంలోను ఈ వైరస్ వ్యాపించింది. ఈ క్రమంలో.. మొదటి మంకీ పాక్స్ కేసు కేరళలోకి వెలుగు చూసింది. యూఏఈ నుంచి కేరళ‌కు వచ్చిన వ్యక్తికి మంకీపాక్స్ ఉండటాన్ని అధికారులు గుర్తించారు.

Next Story

Most Viewed