ప్రధాని మోడీకి రోజులు దగ్గర పడ్డాయి: ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఫైర్

by Disha Web |
ప్రధాని మోడీకి రోజులు దగ్గర పడ్డాయి: ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఫైర్
X

దిశ, ముషీరాబాద్: ప్రధాని మోడీకి దిగిపోయే రోజులు ద‌గ్గర‌ప‌డ్డాయని ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. పెంచిన గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌ను నిర‌సిస్తూ గురువారం క‌వాడిగూడ, భోల‌క్‌పూర్‌ ప్రాగాటూల్స్ చౌర‌స్తా వ‌ద్ద ధ‌ర్నా జ‌రిగింది. ఈ ధ‌ర్నాకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా బై బై మోడీ, డౌన్ డౌన్ మోడీ, డౌన్ డౌన్ బీజేపీ అంటూ టీఆర్ఎస్ పార్టీ కార్యక‌ర్తలు నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన 2014 నుంచి గ‌డిచిన ఎనిమిదేళ్లల్లో గ్యాస్ ధ‌ర‌ల‌ను విప‌రీతంగా పెంచుతూ వ‌స్తున్నార‌న్నారు. 2014లో 400 రూపాయ‌లు ఉన్న గ్యాస్ ధ‌ర‌ను ప్రస్తుతం 1100 వంద‌ల రూపాయ‌ల‌కు పైగా పెంచి పేదోడి న‌డ్డివిరుస్తున్న ఘ‌న‌త మోడీదే అని ఎద్దేవా చేశారు. విద్యుత్ బిల్లలు, పెట్రోలు, డీజిల్ ధ‌ర‌ల‌ను పెంచడం వ‌ల్ల నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లు పెరిగాయ‌ని, వాటితో పేద ప్రజ‌లు పెరిగిన ధ‌ర‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతుంటే కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధ‌ర‌ను పెంచ‌డం దారుణ‌మ‌న్నారు. భార‌త‌దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో మెడిక‌ల్ కాలేజీల‌ను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ‌కు మొండిచేయి చూపించింద‌ని విమ‌ర్శించారు.

ఐటిఆర్‌ తెలంగాణ‌కు వ‌చ్చిన కూడా దానిని మోడీ ఆపుతున్నార‌న్నారని ఆరోపించారు. కేసీఆర్ దేశానికి కావాలని ప్రజ‌లంద‌రూ కోరుకుంటుంటే.. దానిని మోడీ జీర్ణించుకోలేక‌పోతున్నార‌ని ధ్వజ‌మెత్తారు. పెంచిన గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌ను కేంద్ర ప్రభుత్వం వెంట‌నే తగ్గించాల‌ని డిమాండ్ చేసారు. టీఆర్ఎస్ పార్టీ భోల‌క్‌పూర్ డివిజ‌న్ అధ్య‌క్షుడు వై.శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో జ‌రిగిన ఈ ధ‌ర్నాలో టీఆర్ఎస్ పార్టీ యువ‌జ‌న నాయ‌కుడు ముఠా జైసింహా, టీఆర్ఎస్ పార్టీ భోల‌క్‌పూర్, క‌వాడ‌గూడ‌, అడిక్‌మెట్‌, గాంధీన‌గ‌ర్, రాంన‌గ‌ర్ డివిజ‌న్ల అధ్యక్షులు వై.శ్రీనివాస్‌రావు, వ‌ల్లాల శ్యామ్ యాద‌వ్‌, బ‌ల్ల శ్రీనివాస్‌రెడ్డి, ఎం.రాకేష్‌కుమార్‌, ఆర్‌.మోజ‌స్, నాయ‌కులు సోమ‌సుంద‌రం, మారిశెట్టి న‌ర్సింగ్ రావు, క‌రికె కిర‌ణ్‌కుమార్‌, శ్రీధ‌ర్‌రెడ్డి, జునేద్ బాగ్దాది, ల‌క్ష్మీ, సంధ్య‌, వ‌ల్లాల శ్రీనివాస్ యాద‌వ్‌, ఆర్‌.శ్రీనివాస్‌, గుండు జ‌గ‌దీష్‌, ర‌విశంక‌ర్ గుప్త‌, పిఎస్‌.శ్రీనివాస్‌, శ్రీకాంత్‌, గోవింద్‌, క‌ల్యాణ్‌, ప‌రుశురామ్‌, జ‌హంగీర్‌, పాశం ర‌వి, రాజేష్‌, స‌త్యనారాయ‌ణ‌, ప్రవీణ్‌, శ్రావ‌ణ్‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed