యువత అలర్ట్ : పోలీసు ఉద్యోగ నోటిఫికేషన్లపై మంత్రి కీలక ప్రకటన

by samatah |
యువత అలర్ట్ : పోలీసు ఉద్యోగ నోటిఫికేషన్లపై మంత్రి కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ నిరుద్యోగులకు ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తీపి కబురు అందించారు. చాలా రోజుల నుంచి పోలీసు కొలువు కొట్టాలని చూస్తున్నవారికి గుడ్ న్యూస్ చెప్పారు. 80 వేలకు పైగా, ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. అందులో 20వేల పోస్టులు పోలీస్ శాఖలోనే ఉన్నాయని చెప్పడంతో యువత కసరత్తు మొదలు పెట్టింది. అయితే వచ్చే వారంలో పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వస్తుందని, అభ్యర్థులందరూ సిద్ధంగా ఉండాలని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఇక ఇప్పటికే చాలా మంది సర్కార్ కొలువు కోసం కోచింగ్ సెటర్లలో కష్టపడుతున్న విషయం తెలిసిందే.

Next Story

Most Viewed