పాఠశాలకు సడెన్‌గా వచ్చిన మంత్రి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

by Gopi |
పాఠశాలకు సడెన్‌గా వచ్చిన మంత్రి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
X

దిశ, మరిపెడ: మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సీరోలు గ్రామంలో ఏకలవ్య ఆదర్శ గురుకుల బాలికల పాఠశాలలో కలుషిత ఆహారం తినికొంతమంది విద్యార్థినిలు అస్వస్థతకు గురైన నేపథ్యంలో బుధవారం మంత్రి సత్యవతి రాథోడ్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి అక్కడే టిఫిన్ చేశారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సీరోలు గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారన్న విషయం తెలిసిన వెంటనే కలెక్టర్, జిల్లా అధికారులతో మాట్లాడి విద్యార్థుల ఆరోగ్యాన్ని పరిరక్షించాలని, మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పారు. పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, వారంతా కోలుకున్నారన్నారు. తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన పని లేదని ఆమె భరోసా ఇచ్చారు. మంత్రితోపాటు కలెక్టర్ శశాంక, జెడ్పీటీసీ బండి వెంకట్ రెడ్డి, జిల్లా అధికారులు, స్థానిక నేతలు ఉన్నారు.

Next Story

Most Viewed