నిరూపించకపోతే చంద్రబాబు గుండు కొట్టించుకుంటాడా?

by Disha Web Desk 2 |
నిరూపించకపోతే చంద్రబాబు గుండు కొట్టించుకుంటాడా?
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంత్రి పెద్దిరెడ్డి సవాల్ విసిరారు. తాను అవినీతికి పాల్పడ్డానని ఆరోపించడం కాదు, నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. నిరూపించకపోతే చంద్రబాబు గుండు కొట్టించుకుంటాడా? అని సవాల్ విసిరారు. తాము కుప్పంలో గెలవాలని పట్టుదలతో ఉన్నట్లు పేర్కొన్నారు. కుప్పంలో పరిస్థితులను చూసి చంద్రబాబుకు భయం పట్టుకుందని విమర్శించారు. అసలు కుప్పంలో చంద్రబాబు పోటీ చేసే పరిస్థితి లేదని, ఒకవేళ పోటీ చేసినా ఓడి పోతారని జోస్యం చెప్పారు. చంద్రబాబుకు ఇంగ్లీష్​రాదనే, భావితరాలకు ఇంగ్లీష్ విద్యను అందిస్తే చౌకబారు విమర్శలు చేస్తున్నారని మంత్రి దుయ్యబట్టారు. ఈ మేరకు ఆయన విజయవాడలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.



Next Story

Most Viewed