TRS ఎమ్మెల్యేపై మంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం

by Disha Web Desk 2 |
TRS ఎమ్మెల్యేపై మంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం
X

దిశ, కూకట్​పల్లి: రహదారులు, రవాణా వ్యవస్థే నగర అభివృద్ధి, ప్రగతికి సూచకలని మంత్రి కేటీఆర్​ అన్నారు. కూకట్​పల్లి నియోజకవర్గంలోని కైత్లాపూర్​ నుంచి అయ్యప్ప సొసైటీ వరకు రూ.86 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆర్​వోబీని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేక్​, ఎమ్మెల్సీలు నవీన్​ కుమార్​, శంభీపూర్​ రాజే, సురభి వాణీదేవి, కలెక్టర్​ హరీష్​, మేయర్​ గద్వాల విజయలక్ష్మీ, డిప్యుటీ మేయర్​ శ్రీలత శోభన్​ రెడ్డి, జోనల్​ కమిషనర్​ మమతలతో కలిసి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్​ మాట్లాడుతూ.. నగర అభివృద్ధికి రహదారులు, రవాణ వ్యవస్థనే సూచికలని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 8052 కోట్ల నిధులతో ఎస్​ఆర్​డీపీ మొదటి విడత కింద నగరంలో ఫ్లై ఓవర్​లు, ఆర్​వోబీలు, ఆర్​యూబీలు, రహదారుల పనులను చేపట్టడం జరిగిందన్నారు. ఎస్ఆర్ డీపీ కింద తీసుకున్న 47 పనుల్లో కైత్లాపూర్​ 30వ ఆర్​వోబీని నేడు ప్రారంభించామని, మిగిలిన 17లో ఈ ఏడాదిలో మరో 6 ఫ్లైఓవర్​లు, వచ్చే ఏడాదిలో మిగిలిన వాటిని ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుని పని చేస్తున్నామని అన్నారు. ఎస్​ఆర్​డీపీ రెండో విడత కింద రూ.3115 కోట్ల నిధులతో పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

అనంతరం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును అభినందనలతో ముంచెత్తారు. కూకట్​పల్లి నియోజకవర్గం అభివృద్ధికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాటు పడుతున్న తీరు అభినందనీయమని అన్నారు. డబుల్ బెడ్​రూంలు, పించన్ల గురించి ఎమ్మెల్యే విన్నవించారని, త్వరలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పించన్లు అందించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. అదే విధంగా జీహెచ్​ఎంసీ అధికారులతో సమావేశమై డబుల్​ బెడ్​రూం ఇండ్లు పేదలకు అందించే విషయంపై చర్చిస్తానని అన్నారు. అదే విధంగా బాలానగర్​లో ఇండస్ట్రీస్ ఎస్టేట్​కు ఇచ్చిన 45 ఎకరాల భూమిలో నుంచి 5 ఎకరాలు వంద పడకల ఆసుపత్రికి కేటాయించాలని ఎమ్మెల్యే కోరారని, త్వరలో వైద్యశాఖ మంత్రి హరీష్​ రావుతో మాట్లాడి త్వరలో వంద పడకల ఆసుపత్రి ప్రారంభించుకునేందుకు చర్యలు తీసుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి పార్లమెంట్​ ఇన్​చార్జి మర్రి రాజశేకర్​ రెడ్డి, పాటిమీది జగన్​, గిడ్డంగుల కార్పొరేషన్​ అధ్యక్షుడు సాయి చంద్​, కూనా వెంకటేష్​ గౌడ్​, కార్పొరేటర్​లు సబీహ బేగం, పగుడాల శిరీష బాబురావు, జూపల్లి సత్యనారాయణ, పండాల సతీష్​ గౌడ్​, రవీందర్​ రెడ్డి, ముద్దం నర్సింహా యాదవ్​, మందాడి శ్రీనివాస్​ రావు, జిల్లా మైనార్టీ విభాగం అధ్యక్షుడు ఎండీ.గౌసుద్దీన్​, మాజీ కార్పొరేటర్​లు తూము శ్రావణ్​ కుమార్​, కాండూరి నరేంద్ర చార్యా, బాబురావులు పాల్గొన్నారు.

పెళ్లి బరాత్​లా ఉంది: కేటీఆర్​

ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో ఆయా డివిజన్​ల కార్పొరేటర్​లు, డివిజన్​ అధ్యక్షులు గులాబీ తలపాగాలు, గులాబీ కండువాలు, కళాకారుల నృత్యాలతో మంత్రి కేటీఆర్​కు స్వాగతం పలకడంతో కేటీఆర్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్​ సభా ప్రాంగణానికి వస్తుంటే పెళ్లి బరాత్​లో వస్తున్నట్టు అనిపించిందని, కూకట్​పల్లి టీఆర్​ఎస్​ శ్రేణులు ఎంతో వైభవంగా సభను నిర్వహించడం అనందంగా ఉందని అన్నారు.

ఆయా డివిజన్​ల నుంచి భారీ బైక్​ ర్యాలీలు:

కూకట్​పల్లి నియోజకవర్గం పరిధిలోని కూకట్​పల్లి, బాలానగర్​, ఓల్డ్​ బోయిన్​పల్లి, ఫతేనగర్​, అల్లాపూర్​, బాలాజీనగర్​, కేపీహెచ్​బీ కాలనీ, బేగంపేట్​ డివిజన్​ల నుంచి కార్పొరేటర్​ల ఆధ్వర్యంలో వేలమంది నాయకులు, కార్యకర్తలు బైక్​ ర్యాలీ నిర్వహిస్తూ సభ ప్రాంగణానికి తరలి వచ్చారు. సభలో సుమారు 20 వేల మంది పైగా హాజరయ్యారు.



Next Story