Minister KTR: జ్యోతిరాదిత్య సింధియా కామెంట్స్‌కు మంత్రి కేటీఆర్ కౌంటర్

by Rajesh |   ( Updated:2022-08-11 07:57:05.0  )
Minister KTR Hits Out Union Minister Jyotiraditya Scindia Satirically
X

దిశ, వెబ్‌డెస్క్: Minister KTR Hits Out Union Minister Jyotiraditya Scindia Satirically| కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఎదుగుబొదుగు లేని బీమారు రాష్ట్రాలకు చెందిన బీజేపీ నాయకుల చిత్తశుద్ధిని నిజంగా మెచ్చుకోవాల్సిందేనంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు. బీజేపీ నేతలు తెలంగాణకు వచ్చి విభజన రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని, కుతంత్రాలు, బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు మంత్రి సవాల్ విసిరారు. సింధియా సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్ ఏ ఒక్క అంశంలో అయినా తెలంగాణ కంటే మెరుగ్గా ఉందో చూపించాలని కేటీఆర్ సవాల్ చేశారు. శుక్రవారం తెలంగాణలో పర్యటించిన సింధియా తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అవినీతి తీవ్ర స్థాయిలో ఉందని మండిపడ్డారు. ప్రధాని మోడీ హయాంలో తెలంగాణకు అధిక మొత్తంలో నిధులు వచ్చాయని, ఆ నిధులు సద్వినియోగం అయ్యాయో? దుర్వినియోగం అయ్యాయో? లెక్క తేల్చాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పెద్దలకు ఈడీ, సీబీఐ అంటే భయం పట్టుకుందని.. అవినీతికి పాల్పడకుంటే భయమెందుకని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలకు ట్విట్టర్ వేదికగా శనివారం కేటీఆర్ స్పందిస్తూ.. దేశ జనాభాలో 2.5 శాతం ఉన్న తెలంగాణ రాష్ట్రం దేశ జీడీపీలో 5 శాతం కాంట్రిబ్యూషన్ చేస్తోందని అన్నారు. తెలంగాణకు చెందిన ప్రతి ఒక్క వ్యక్తి ఒక డబుల్ ఇంజిన్ లా పని చేస్తూ దేశ పురోగతికి దోహదపడుతున్నాడని చెప్పారు. దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాలు తెలంగాణతో పాటు రాణిస్తే 75వ స్వాతంత్ర్య దినోత్సవం నాటికి భారత్ 10 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగి ఉండేవాళ్లని విమర్శించారు.

ఇది కూడా చదవండి: అధిక మొత్తంలో వడ్డీలు.. కోరుట్లలో ఇద్దరు అరెస్ట్

Advertisement

Next Story

Most Viewed