సెట్‌లో బాడీ సైజుల డిస్కషన్.. నరకం అనుభవించా : మెలానీ

by Disha Web Desk |
సెట్‌లో బాడీ సైజుల డిస్కషన్.. నరకం అనుభవించా : మెలానీ
X

దిశ, సినిమా: ప్రముఖ న్యూజిలాండ్ స్టార్ యాక్ట్రెస్ మెలానీ లిన్‌స్కీ తనకు సెట్స్‌లో ఎదురైన ఇబ్బందుల గురించి వెల్లడించింది. 2000 సంవత్సరంలో విడుదలైన 'కొయెట్ అగ్లీ' మూవీ షూటింగ్‌లో తాను బాడీ షేమింగ్‌కు గురైనట్లు తెలిపింది. డేవిడ్ మెక్‌నాలీ దర్శకత్వం వహించిన ఈ శృంగారభరిత సినిమా చిత్రీకరణ పూర్తయ్యేవరకు నరకం అనుభవించినట్లు పేర్కొంది. అందరు అమ్మాయిల మాదిరే పద్ధతిగా ఉన్నప్పటికీ తనను టార్గెట్ చేసి సెట్‌లో బాడీ సైజుల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా అనిపించిందని వాపోయింది.

దీనికి కూడా కారణముందన్న మెలానీ.. షూటింగ్ టైమ్‌లో ఎన్నోసార్లు ఆకలితో అల్లాడిపోవడంతో సినిమా పూర్తయ్యేసరికి సన్నగా మారిపోయినట్లు తెలిపింది. కాస్ట్యూమ్ డిజైనర్స్ ఎవరూ తనకు సహకరించకపోవడంతో చిత్రం పూర్తయ్యాక తనను చూసి అభిమానులు నిరాశ చెందినట్లు చెప్పుకొచ్చింది.

Next Story

Most Viewed