- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
70 ఏళ్ల జూ చరిత్రలో ఫస్ట్ ఫీమేల్ 'ఆల్ఫా'.. మకాక్ క్వీన్‌గా అవతరించిన 'యాకీ'!

దిశ, ఫీచర్స్ : రాకీ భాయ్ అయినా, పుష్ప అయినా.. ఒక్కొక్కరిగా తమ పై వాళ్ళని ఢీ కొట్టుకుంటూ తుదిగా 'సింహాసనం' అధిష్టిస్తారు. కథ వేరు కావచ్చు, కథనం వేరు కావచ్చు కానీ.. అల్టిమేట్ టార్గెట్ మాత్రమే అదే. 'యాకీ' పోరాటం కూడా ఇలాంటిదే. యాకీ అధికారంలోకి వచ్చిన విధానం హాలీవుడ్ కథాంశానికి ఏమాత్రం తక్కువ కాదనిపిస్తుంది. తకాసాకియామా నేచురల్ జూలాజికల్ గార్డెన్ 70 ఏళ్ల చరిత్రను తిరగరాస్తూ మొదటి మహిళా ఆల్ఫాగా ఎదిగింది. తొమ్మిదేళ్లకే ట్రూప్ లీడర్‌గా ఆవిర్భవించిన యాకీ ఓ ఆడ జపనీస్ మకాక్. అనేక మంది బలమైన మగ కోతులతో పోరాడి సిబ్బందిని ఆశ్చర్యపరిచిన యాకీ స్టోరీ ఏంటో తెలుసుకుందాం.
జపాన్‌లోని ఓయిటా నగరంలోని తకసాకియామా జంతు ప్రదర్శనశాలలోని మకాక్ ట్రూప్స్‌కు ర్యాంక్స్ నిర్దేశిస్తారు. ఈ మేరకు ఆడ మకాక్స్ తమ తల్లుల కింది ర్యాంక్‌ను వారసత్వంగా పొందుతారు. ఇవి బృందాలను విడిచిపెట్టడం చాలా అరుదు. అయితే మగ మకాక్స్ మాత్రం యుక్తవయస్సు రాగానే మరో ట్రూప్‌లో చేరేందుకు వాటి నాటల్ ట్రూప్స్‌ను (జన్మ దళాలు) విడిచిపెడతాయి. ఇక్కడ వారి ర్యాంక్ సమూహంలో గడిపిన సమయం, ఇతర మగ కోతులను సవాలు చేయడం.. హింసాత్మక పోరాటాల్లో వాటిని ఓడించడంపై ఆధారపడుతుంది. సరిగ్గా యాకీ అదే చేసింది. ఇది 677-స్ట్రాంగ్ ట్రూప్ Bలో జన్మించిన ఫీమేల్ మకాక్ కాగా.. మకాక్ సొసైటీ నిబంధనల ప్రకారం తన తల్లి కింది ర్యాంక్‌ను వారసత్వంగా పొందింది. ఒక కోతి ర్యాంక్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఆహారం సంపాదించేందుకు.. సహచరులు, విశ్రాంతి ప్రదేశాలను విజిట్ చేసేందుకు యాక్సెస్ ఉంటుంది.
తల్లిపై పోరాటం
యాకీ గత మార్చిలో తన సొంత తల్లితో పోరాడి గెలిచింది. ఆమె సమూహంలోని ఇతర ఆడ కోతులకు నాయకురాలైంది. ఆడ కోతులకు సంబంధించి ఇదే మెరుగైన ర్యాంక్ కావచ్చు కానీ యాకీ అన్ని బృందాలకు లీడర్‌గా ఎదగాలనుకుంది. అందువల్ల యాకీ లక్ష్యానికి ఇది మొదటి అడుగు మాత్రమే. ఈ క్రమంలోనే తల్లి నుంచి అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత మరింత ఆత్మవిశ్వాసంతో ట్రూప్ బీలోని గతంలో నాలుగో ర్యాంక్ పొందిన మేల్ మకాక్‌ను అధిగమించింది. ఈ క్రమంలోనే ట్రూప్ బీ సింహాసనాన్ని అధిరోహించే మార్గంలో, యాకీ మొదట మూడో ర్యాంక్‌లో ఉన్న గోమోన్‌ను, తదుపరి మెక్ క్లేన్, చివరగా 31 ఏళ్ల నాంచును ఓడించి.. తకాసాకియామా జూ 70 ఏళ్ల చరిత్రలో మొదటి మహిళా ఆల్ఫాగా యాకీ అవతరించింది.
'జపనీస్ మకాక్ సమూహంలో ఆల్ఫా పాలన కొన్ని నెలల నుంచి దశాబ్దం వరకు కొనసాగుతుంది. మరి యాకీ పాలన ఎంతకాలం ఉంటుందో నిపుణులు నిర్ణయించడం అసాధ్యం. కానీ ఆమె తన బృందంలో అగ్ర స్థానానికి చేరుకుంది. ఇది నమ్మశక్యం కానీ విజయం. ఇటువంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి. ప్రస్తుతానికి ఎవరూ ఆమెను సవాలు చేస్తున్నట్లు అనిపించడం లేదు' అని తకాసాకియామా నేచురల్ జూలాజికల్ గార్డెన్ వారు తెలిపారు.