- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైద్య సిబ్బంది పారదర్శకంగా విధులు నిర్వహించాలి : కలెక్టర్ హరిత
వైద్య సిబ్బంది పారదర్శకంగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హరిత అన్నారు.

దిశ, ఆసిఫాబాద్ : వైద్య సిబ్బంది పారదర్శకంగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హరిత అన్నారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల వైద్య సిబ్బందికి జిల్లా అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మట్తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. అందుకు అనుగుణంగా వైద్య సిబ్బంది సమన్వయంతో, పారదర్శకంగా విధులు నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఖచ్చితమైన సమయపాలన పాటించాలని, విధుల పట్ల ఎలాంటి అలసత్వం ప్రదర్శించినా సహించేది లేదని హెచ్చరించారు.
అంతకుముందు జైనూర్ మండలంలో జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృత్తి విద్యా కోర్సుల ఉచిత శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. జిల్లాలో యువతీయువకులు మూడు నెలల ఉచిత కోర్సులను సద్వినియోగం చేసుకొని తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకునేందుకు ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.






