- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సెల్ఫ్ ఫైనాన్స్ కాలనీ సమస్యల పరిష్కారానికి చర్యలు:ఎంపీ ఈటల రాజేందర్
ఎల్బీనగర్ నియోజకవర్గం బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని సెల్ఫ్ ఫైనాన్స్ కాలనీ సంక్షేమ సంఘం భవన నిర్మాణం కొరకు సహకరించాలని కాలనీ అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు బి.యన్.రెడ్డి నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులతో కలిసి వినతి పత్రం అందజేశారు.

దిశ, హస్తినాపురం: ఎల్బీనగర్ నియోజకవర్గం బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని సెల్ఫ్ ఫైనాన్స్ కాలనీ సంక్షేమ సంఘం భవన నిర్మాణం కొరకు సహకరించాలని కాలనీ అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు బి.యన్.రెడ్డి నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులతో మంగళవారం కలిసి శాలువాతో సత్కరించి, వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. అతి త్వరలోనే కాలనీ అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు చప్పిడి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి నిట్టు కృష్ణ, ఉపాధ్యక్షులు వరప్రసాద్, కోశాధికారి సుదర్శనం, సంయుక్త కార్యదర్శి కృష్ణారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ గోపి, కార్యవర్గ సభ్యులు పాండు, జయరాజు, రాజు, ఉమాశంకర్, ప్రవీణ్, మహేష్, పార్టీ సీనియర్ నాయకులు రవిశంకర్, పిట్ట శ్రీనివాస్ రెడ్డి, సుధీర్ కుమార్, చిన్న యాదవ్, దిలీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






