వివాహిత అదృశ్యం

by Disha Web |
వివాహిత అదృశ్యం
X

దిశ, రాయికోడ్: వివాహిత ఓ మహిళ అదృశ్యమైన సంఘటన మండల పరిధిలోని సంగాపూర్ గ్రామంలో చోటు చేసుకొంది. ఇందుకు సంబంధించి స్థానిక ఎస్ఐ ఏడుకొండలు తెలిపిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. రాయికోడ్ మండలంలోని సంగాపూర్ గ్రామానికి చెందిన ఆశంగారి గాల్ రెడ్డి కుమారుడు ఆశంగారి మోహన్ రెడ్డికి ఝరాసంగం మండలంలోని జోనగామ గ్రామానికి చెందిన చిట్యాపు నరసింహరెడ్డి కుమార్తె గాయత్రి(19)తో గత ఏడాది క్రితం పెళ్లి జరిగిందన్నారు. అప్పటినుండి వారి సంసారం సాఫీగా సాగిందన్నారు. అంతలో ఏమి జరిగిందో ఏమో గానీ గురువారం రాత్రి కుటుంబ సభ్యులతోపాటు గాయత్రి మేన మామ కాపు సంగారెడ్డితో కలిసి భోజనం చేసి నిద్రపోతున్నట్లు పేర్కొన్నారు. అదేరోజు అర్ధరాత్రి 2 గంటల సమయంలో భర్త మోహన్ రెడ్డి లేచి చూడగా ఆమె కనిపించలేదు. చుట్టుప్రక్కల, బంధువుల ఇంటి వద్ద వెతికినా గాయత్రి ఆచూకీ లభించలేదు. దీంతో భర్త మోహన్ రెడ్డి తన భార్య కనిపించడం లేదని శుక్రవారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఏడుకొండలు తెలిపారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed