ఉక్రెయిన్ మోడల్‌తో సందడి చేయనున్న శివకార్తీకేయన్..

by Satheesh |
ఉక్రెయిన్ మోడల్‌తో సందడి చేయనున్న శివకార్తీకేయన్..
X

దిశ, వెబ్‌డెస్క్: మొన్నటి వరకు ఎవరికి అంతగా తెలియని ఉక్రెయిన్ పేరు.. నేడు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోంది. దీనికి కారణం రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్దం. ఇక్కడ మనం ఉక్రెయిన్ గురించి మాట్లాడుకోవటానికి కారణం.. తమిళ హీరో శివకార్తీకేయన్ సినిమాలో ఓ ఉక్రెయిన్ మోడల్ హీరోయిన్‌గా ఎంపికవ్వడం. తాజాగా తమిళ స్టార్ హీరో శివకార్తీకేయన్ నెక్ట్స్ మూవీ గురించి అప్‌డేట్ వచ్చింది. ఎస్‌కే20 అనే వర్కింగ్‌ టైటిల్‌‌తో జాతి రత్నాలు ఫేం అనుదీప్‌ కేవీ దర్శకత్వంలో శివ కార్తీకేయన్‌ హీరోగా ఓ సినిమా రూపొందుతుంది. అయితే, ఈ సినిమాలో ఉక్రెయిన్ మోడల్, నటి మరియా ర్యాబోషాప్క హీరోయిన్‌గా నటించనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా దృవీకరించింది. దీనితో హీరో శివకార్తీకేయన్ కూడా ట్వీట్టర్ వేదికగా 'వెల్‌కమ్‌ మరియా ర్యాబోషాప్క' అంటూ స్వాగతం పలికాడు. కాగా, ఫుల్‌‌లెంగ్త్ కామెడీతో రూపొందుతున్న ఈ సినిమా శ్రీవెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ బ్యానర్లో తెరకెక్కనుంది.

Next Story

Most Viewed