మణిపూర్‌లో స్కూళ్లు రీ ఓపెన్

by Disha Web Desk |
మణిపూర్‌లో స్కూళ్లు రీ ఓపెన్
X

ఇంఫాల్: మణిపూర్ ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 8వ తేదీ నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు రీఓపెన్ చేస్తున్నట్లు శనివారం విద్యాశాఖ కమిషనర్ హెచ్.జ్ఞాన్‌ప్రకాశ్ తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం అధికారిక ప్రకటించింది. కరోనా సంక్షోభం కారణంగా మూతపడిన పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నట్లు హెచ్.జ్ఞాన్‌ప్రకాశ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా లక్షణాలు ఉన్న పిల్లలను పాఠశాలకు పంపొద్దన్నారు. ప్రత్యక్ష తరగతులు ప్రారంభమైనప్పుడు ఉపాధ్యాయులు కరోనా నిబంధనలు కచ్ఛితంగా పాటించాలన్నారు. మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి నిబంధనలు పాటించాలన్నారు. ఉపాధ్యాయులందరూ బూస్టర్ డోస్ తప్పనిసరిగా వేసుకోవాలని ఆయన సూచించారు. కాగా, గత నెల కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మణిపూర్ ప్రభుత్వం 8వ తరగతి వరకు పాఠశాలలను మూసివేసింది.


Next Story

Most Viewed