కోట్లు కుమ్మరించిన కల.. భారీ లాటరీ దక్కించుకున్న అమెరికన్

by Disha Web |
కోట్లు కుమ్మరించిన కల.. భారీ లాటరీ దక్కించుకున్న అమెరికన్
X

దిశ, ఫీచర్స్ : కలలో చూసిన సంఘటనల ఆధారంగా కొంత మంది భవిష్యత్తును అంచనా వేయగలరు. దేవుడే ఇలా చేయిస్తున్నాడని, కలలో తమను హెచ్చరిస్తూ మార్గదర్శకం చేస్తున్నాడని, రక్షణ కల్పిస్తున్నాడని నమ్ముతారు. ఇదే కోవకు చెందిన అమెరికన్.. కలలో కనిపించిన నంబర్లను ఉపయోగించి కోట్ల విలువైన లాటరీ దక్కించుకున్నాడు.

వర్జీనియాలోని హెన్రికోకు చెందిన అలోంజో కోల్‌మాన్ తనకు కలలో కనిపించిన ఆరు నంబర్‌లకు కృతజ్ఞతలు తెలిపాడు. గ్లెన్‌సైడ్ కార్నర్ మార్ట్ నుంచి బ్యాంక్ ఏ మిలియన్ టికెట్ కొనుగోలు చేసిన అలోంజో.. తనకు డ్రీమ్‌లో 13-14-15-16-17-18 నంబర్లు కనిపించాయని, అవే ఆరు సంఖ్యలను ఎంచుకున్నానని చెప్పాడు. దీంతో దాదాపు రూ. 1.96 కోట్లు($250,000) లాటరీ దక్కించుకున్నట్లు తెలిపిన ఆయన.. ఇంకా నమ్మలేకపోతున్నానని చెప్తున్నాడు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed