నల్లగొండలో వ్యక్తి దారుణ హత్య

by Jakkula.Mamatha |   (  Updated:2026-06-09 04:11:01  IST  )

నల్లగొండలో మంగళవారం మరో దారుణ హత్య జరిగింది.

నల్లగొండలో వ్యక్తి దారుణ హత్య
X

దిశ, నల్లగొండ క్రైమ్: నల్లగొండలో మంగళవారం మరో దారుణ హత్య జరిగింది. పెద్ద బండలోని సత్యనారాయణ కాలనీకి చెందిన బోతు సాయిని దారుణంగా చంపేశారు. తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్లగొండకు కూతవేటు దూరంలో ఉన్న హ్యాపీ హోమ్స్ ఎదురుగా వెంచర్‌లో సాయిని దుండగులు హతమార్చారు. బండరాళ్లతో మోది మెదడు బయటికి వచ్చేలా దారుణ ఘటనకు ఒడిగట్టారు. ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న టూ టౌన్ సిఐ రాఘవ రావు, తిప్పర్తి ఎస్ఐ శంకర్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. క్లూస్ టీం, డాగ్ టీం ప్రత్యేకంగా ఆధారాలను సేకరిస్తున్నారు. ఘటనస్థలికి పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు, పట్టణ ప్రజలు చేరుకున్నారు. హత్యకు కారకులు ఎవరో త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story