రాజగోపాల్ రెడ్డి లక్ష్యం ఇదే.. మల్లు రవి సెన్సేషనల్ కామెంట్స్

by Disha Web |
రాజగోపాల్ రెడ్డి లక్ష్యం ఇదే.. మల్లు రవి సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో ఉంటూ.. బీజేపీకి అనుకూలంగా పని చేశారని మండిపడ్డారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌ను చంపాలని చూశారని కీలక వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ప్రజలు రాజగోపాల్ రెడ్డిని రాజకీయంగా బొంద పెడుతారని అన్నారు. అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దాసోజు శ్రవణ్ పార్టీ మారడం తొందరపాటు నిర్ణయమని పేర్కొన్నారు. సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఈ సందర్భంగా మల్లు రవి తెలిపారు.

Next Story

Most Viewed