'మహా' సంక్షోభంపై మల్లిఖార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
మహా సంక్షోభంపై మల్లిఖార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. శివసేన ఎమ్మెల్యేల తిరుగుబాటుతో అధికార మహా వికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే సీఎం ఉద్దవ్ ఠాక్రే రాజీనామా చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఎమ్మెల్యేలు కోరితే మహా వికాస్ అఘాడీ కూటమి నుండి బయటికి వచ్చేందుకు కూడా శివసేన సిద్ధంగా ఉందని ఇప్పటికే శివసేన నేత సంజయ్ రౌత్ ప్రకటించారు. మరోవైపు శివసేన రెబల్ నేత ఏకనాథ్ షిండే‌కు గంట గంటకు ఎమ్మెల్యేల మద్దతు పెరుగుతోంది. దీనితో మహారాష్ట్ర రాజకీయాలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. ఈ తరుణంలో కాంగ్రెస్ అగ్ర నేత మల్లిఖార్జున ఖర్గే మహా రాజకీయ సంక్షోభంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. మహా వికాస్ అఘాడీ కూటమిని కూలదోసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రాల్లో బీజేపీయేతర ప్రభుత్వాలు ఉండకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఎవరు ఎన్ని చేసినా మహా వికాస్ అఘాడీ కూటమి బలమైన ప్రభుత్వమని తెలిపారు.



Next Story

Most Viewed