మహారాష్ట్రలో మహిళలు భారీ ర్యాలీ.. వీడియో వైరల్

by Dishafeatures2 |
మహారాష్ట్రలో మహిళలు భారీ ర్యాలీ.. వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ర్యాలీ అంటే అందరికీ గుర్తొచ్చేది కుర్రోళ్లే. ఎక్కువ శాతం వారే బైక్ ర్యాలీలు చేస్తుంటారు. కొన్నిసార్లు రాజకీయ నాయకుల కోసం చేస్తే మరికొన్ని సార్లు తమ అభిమాన హీరోల కోసమూ చేస్తుంటారు. అంతేకాకుండా ప్రత్యేక పండగలకైతే బైక్ ర్యాలీలే ప్రధాన ఈఎంట్‌గా కూడా మారుతుంది. అయితే బ్యాక్ ర్యాలీ అనగానే కుర్రోళ్ల కేకలు, నినాదాలు, బైక్‌ల శబ్దాలే గుర్తొన్నాయి. అవే ఉంటాయి కూడా. బైక్ ర్యాలీల్లో పాల్గొనేవారి కేకలు, బైకుల రణగొణ ధ్వనులతో వీధులు కంపించి పోతాయి. ఇవన్నీ ఒకెత్తు అయితే పండగల సందర్భంగా చేసే బ్యాక్ ర్యాలీలు మరో ఎత్తు. అంతా పాజిటివ్ వైబ్స్‌తో నిండిపోతుంది. ప్రతి ఒక్కరిని విష్ చేస్తూ వెళతారు. అందులోనూ నూతన సంవత్సరం అంటే తనమన బేధం లేదు. కనిపించే ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతారు.

అయితే తాజాగా మహారాష్ట్రలో ఉగాది సందర్భంగా భారీ బైక్ ర్యాలీ జరిగింది. ఇందులో అంతా మహిళలే పాల్గొన్నారు. ఉగాది అంటే మరాఠా నూతన సంవత్సరంటూ మహిళలు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇందులో అందరూ సాంప్రదాయ దుస్తుల్లో అందరినీ ఆకట్టుకున్నారు. ఆంగ్ల నూతన సంవత్సరాన్నే అట్టహాసంగా జరుపుకుంటున్నప్పుడు మన జాతీయ నూతన సంవత్సరానికి ఎందుకు వేడుకలు చేసుకోకూడదు అంటూ కొందరు అంటున్నారు. ఇలా ఉగాదిని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అక్కడి వారంటున్నారు. ప్రస్తుతం ఈ ర్యాలీకి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.


Next Story

Most Viewed