Lokesh: విద్యుత్ వినియోగం 300 యూనిట్లు దాటితే ఇక ఆ పథకం లేనట్లే

by Dishanational2 |
Lokesh: విద్యుత్ వినియోగం 300 యూనిట్లు దాటితే ఇక ఆ పథకం లేనట్లే
X

దిశ, ఏపీ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.విద్యుత్ వాడకం 300 యూనిట్లు దాటితే అమ్మఒడి ఉండదంటూ ప్రభుత్వ నిర్ణయాన్ని ట్విటర్ వేదికగా తప్పుబట్టారు. 'కన్న తల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తానన్నట్టు ఉంది జగన్ మోసపు రెడ్డి అమ్మ ఒడి పథకం తీరు. తేదీల మతలబుతో ఒక ఏడాది ఎగ్గొట్టి, మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో రూ.1000 కోత పెట్టి అర్ద ఒడిగా మారిన పథకంపై ఇప్పుడు ఆంక్షల కత్తి ఎక్కుపెట్టి పథకం మనుగడనే ప్రశ్నార్ధకంగా మార్చేసారు. 300 యూనిట్లు దాటి కరెంట్ వాడితే కట్, ప్రతి విద్యార్థికి 75 శాతం హాజరు తప్పనిసరి, ఆధార్‍లో కొత్త జిల్లాలను నమోదు చేసుకోవాలి, కొత్త బియ్యం కార్డు ఉంటేనే అమ్మఒడి లాంటి కండిషన్స్ అప్ప్లై అని ముందే ఎందుకు చెప్పలేదు జగన్ మోసపు రెడ్డి ? మీ సతీమణి గారు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే రూ.30 వేలు వేస్తామని ఇచ్చిన హామీని కూడా గంగలో కలిపేసారు. అమ్మలని మానసిక క్షోభకి గురిచేసే ఈ ఆంక్షలు తీసేసి అర్హులందరికీ అమ్మ ఒడి ఇవ్వాలి అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed