దుర్వాసనతో ఇబ్బందులు.. డ్రైనేజీ లీకేజీ పై స్థానికుల ఆందోళన

by Jakkula.Mamatha |

చంపాపేట్ డివిజన్ పరిధిలోని మారుతి నగర్ కాలనీలో డ్రైనేజ్ లీకేజీ సమస్య స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది.

దుర్వాసనతో ఇబ్బందులు.. డ్రైనేజీ లీకేజీ పై స్థానికుల ఆందోళన
X

దిశ, చంపాపేట్: చంపాపేట్ డివిజన్ పరిధిలోని మారుతి నగర్ కాలనీలో డ్రైనేజ్ లీకేజీ సమస్య స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. కాలనీలోని రోడ్ నెంబర్-1, స్ట్రీట్ నెంబర్-11 వద్ద డ్రైనేజీ నీరు రోడ్డుపైకి పొంగిపొర్లుతుండడంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర దుర్వాసన వ్యాపిస్తోంది. డ్రైనేజీ నీరు రోడ్డుపై నిల్వ ఉండటంతో కాలనీవాసులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. దుర్వాసన కారణంగా చిన్నారులు, వృద్ధులు, స్థానిక ప్రజలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలం నేపథ్యంలో ఈ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి డ్రైనేజీ లీకేజీని అరికట్టి, కాలనీలో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరచాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జీహెచ్‌ఎంసీ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Next Story