'లైగర్' ప్రమోషన్స్ స్టార్ట్.. పాట్నా టీ షాప్‌లో రౌడీబాయ్ సందడి

by Disha Web Desk 6 |
లైగర్ ప్రమోషన్స్ స్టార్ట్.. పాట్నా టీ షాప్‌లో రౌడీబాయ్ సందడి
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'లైగర్'. ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే విడుదల తేదీ దగ్గర పడటంతో దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ప్రమోషన్స్ మొదలు పెట్టారు చిత్రబృందం.

ఇందులో భాగంగా విజయ్ దేవరకొండ పాట్నాలోని ఫేమస్ 'గ్రాడ్యుయేట్ చాయ్ వాలీ'కి వెళ్లి టీ తాగాడు. ఆ తర్వాత అక్కడ ఉన్న వారితో కాసేపు ముచ్చటించి.. కొన్ని సెల్ఫీలు దిగారు. దానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అది చూసిన నెటిజన్లు 'ఇది కదా ప్రమోషన్స్ అంటే' అని కామెంట్లు చేస్తున్నారు.


Next Story