- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
న్యూడెమోక్రసీలో చీలిక వాదాన్ని వ్యతిరేకిస్తూ పోరాటం చేద్దాం రండి

దిశ, గుండాల : న్యూడెమోక్రసీ పార్టీలో ఏర్పడిన చీలిక కేవలం పాలక వర్గాలకు ఉపయోగపడేదే తప్ప మరొకటి కాదని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి గాదె దివాకర్, కేంద్ర కమిటీ నాయకులు ఆవునూరి మధు అన్నారు. సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ ఐక్యతకోసం కృషిచేస్తే.. కొందరు మాత్రం పార్టీని నిలువునా చీల్చారని మండిపడ్డారు. ఈ చీలిక భక్రాన్ బీడీ కంపెనీలో చేసిన కుంభకోణాల నుండి తప్పిచుకోవడానికే తప్ప మరొకటి కాదన్నారు. ప్రజలందరూ చీలిక వాదాన్ని ఖండించాలని, ప్రజా సమస్యలపై పార్టీ నిర్వహించే పోరాటాలలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలని వారు పిలుపునిచ్చారు.
న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారానికై మరియు చీలిక వాదాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం గుండాల మండల కేంద్రంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన సభలో వారిరువురు ముఖ్యఅతిధిలుగా పాల్గొని మాట్లాడారు. అనేక ఏళ్లుగా ఆదివాసీ, గిరిజన పేద రైతులు సాగు చేసుకుంటున్న పోడుభూముల ఆక్రమణను నిలుపుదల చేసి పట్టాలివ్వాలని, హరితహారం పేరుతో అక్రమంగా పోడుభూములను అక్రమించుకోవడాన్ని విరమించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశయాలు కల్పించాలని, బయ్యారంలో ఉక్కు పరిశ్రమను స్థాపించి స్థానిక యువతకు అవకాశం కల్పించాలని, పేద ప్రజలందరికీ డబుల్ బెడ్రూంలు మంజూరు చేయాలని, దళితులందరికి దళిత బంధు ఇవ్వాలని, బొగ్గుబావుల,ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని, ఐకేపీ రుణాలు మాఫీచేసి తిరిగి నూతన రుణాలు మంజూరు చేయాలని, రైతాంగ సమస్యలు పరిష్కరించాలని, ఆదివాసీలకు కూడా దళితబంధు లాంటి స్కీం ఏర్పాటు చేయాలని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సభలో గుండాల ఎంపీపీ ముక్తి సత్యం, జడ్పీటీసీ రామక్క, న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు తుపాకుల నాగేశ్వరరావు, వ్యాసరూప వెంకన్న. పెండ్లి కట్ల పెంటయ్య, బాబు, బచ్చలి సారయ్య, మల్లయ్య, మల్లేష్, గుండాల సర్పంచ్ కోరం సీతారాములు, ఎంపీటీసీ పద్మ, పీవైఎల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చింత నర్సింహారావు, పర్షిక రవి, బత్తిని సత్యం, అరుణోదయ నాయకులు కోడి శ్రీరాములు, చిరంజీవి,ఎట్టి నర్సింహా రావు, ఎనగంటి రమేష్, బొగ్గరపు రాజు తదితరులు పాల్గొన్నారు.