ఇతర దేశాలకు విస్తరించే పనిలో లెన్స్‌కార్ట్!

by Disha Web |
ఇతర దేశాలకు విస్తరించే పనిలో లెన్స్‌కార్ట్!
X

న్యూఢిల్లీ: దేశీయ ప్రముఖ ఐవేర్ రిటైల్ సంస్థ లెన్స్‌కార్ట్ అంతర్జాతీయ మార్కెట్‌పై దృష్టి సారించింది. విస్తరణ ప్రక్రియలో భాగంగా ఆసియా మార్కెట్‌పై కన్నెసిన లెన్స్‌కార్ట్ భారత్‌తో పాటు ఇతర దేశాలకు విస్తరించాలనే లక్ష్యంతో ఉన్నట్టు వెల్లడించింది. దీనికోసం తాజాగా జపాన్‌కు చెందిన ఓన్‌డేస్ కంపెనీలో మెజారిటీ వాటాను కొనుగోలు చేసినట్టు తెలిపింది. దీనికి సంబంధించి విలీన ప్రాతిపదికన ఒప్పందం చేసుకున్నామని, ఇది పూర్తయిన తర్వాత తమ కంపెనీ ఆసియాలోనే అతిపెద్ద కళ్లజోడు ఉత్పత్తుల సంస్థగా ఎదగనుందని ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఒప్పందం విలువ దాదాపు రూ. 3,200 కోట్లు ఉండొచ్చని సంబంధిత వర్గాలు అంచనా వేశాయి.

అంతేకాకుండా ఈ కొనుగోలుతో లెన్స్‌కార్ట్ కంపెనీ భారత్‌తో పాటు జపాన్, సింగపూర్, థాయిలాండ్, తైవాన్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, మలేషియా సహా 13 మార్కెట్లకు తన పరిధిని విస్తరించింది. ఈ సందర్భంగా మాట్లాడిన లెన్స్‌కార్ట్ సహ్-వ్యవస్థాపకుడు పీయూష్ బన్సల్, ప్రపంచవ్యాప్తంగా 45 కోట్ల మందికి కళ్లజోడు వినియోగం అవసరమని, వీరిలో కొందరే వాడుతున్నారని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో తాము భవిష్యత్తులో విస్తరణ ప్రక్రియ కొనసాగిస్తామని, వచ్చే ఏడాది మార్చి సమయానికి రూ. 5 వేల కోట్లకు పైగా విక్రయాలను చేపట్టనున్నట్టు ఆయన వెల్లడించారు. కాగా, జపాన్‌కు చెందిన ఓన్‌డేస్ కంపెనీ 1989లో ఏర్పాటైంది. ప్రస్తుతం జపాన్ సహా 12 దేశాల్లో 460 స్టోర్లను నిర్వహిస్తోంది.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed