'బై నౌ.. పే లేటర్' సర్వీస్‌ను ఆపిన LAZYPAY..

by Dishafeatures2 |
బై నౌ.. పే లేటర్ సర్వీస్‌ను ఆపిన LAZYPAY..
X

దిశ, వెబ్‌డెస్క్: LAZYPAY ఈ యాప్ గురించి దాదాపు ప్రతి ఒక్కరూ వినే ఉంటారు. కావాలనుకున్న వస్తువును చూసినా ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొనలేని వారికి ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుంది. అందుకు ఇందులో ఉన్న బై నౌ.. పే లేటర్ సర్వీస్. దీంతో మనకి కావలసిన వస్తును ఇప్పుడు కొనుగోలు చేసి.. దాని ధరను తర్వాత చెల్లిస్తాం. ఈ సర్వీస్ కారణంగానే ఈ యాప్ విస్తృత ప్రచారం అందుకుంది. అయితే తాజాగా ఈ సర్వీస్‌ను తాత్కాళికంగా నిలిపివేస్తున్నట్లు యాప్ యాజమాన్యం వెల్లడించింది. ఈ సస్పెన్షన్‌ను యాప్ యాజమాన్యం ఆర్బీఐ తాజాగా ఇచ్చిన ఆదేశాల కారణంగా అమలు చేసింది. అంతేకాకుండా తమ వినియోగదారులకు ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. తాము సరికొత్త టర్మ్స్, కండిషన్స్‌ను తెచ్చామని, ప్రతి ఒక్కరూ వాటిని అంగీరించాలని కోరింది. అలా చేయని పక్షంలో ఫ్లాట్‌ఫార్మ్‌లో వారి అన్ని లావాదేవీలు బ్లాక్ చేయబడతాయని యాప్ యాజమాన్యం తెలిపింది. అయితే నెల రోజుల క్రితం నాన్-బ్యాంక్ వాలెట్స్, ప్రీ-పెయిడ్ కార్డ్‌లు తమ ఉత్పత్తుల ద్వారా కస్టమర్ల క్రెడిట్ లైన్‌ను పెంచలేవు అని ఆర్బీఐ వెల్లడించింది. అయితే 2020లో లాంచ్ అయిన లేజీపే యాప్ తమ యూజర్లకు రూ.1 లక్ష వరకు క్రెడిట్ లైన్‌ను ఇస్తుంది. తాజాగా ఆర్బీఐ ఈ మేరకు ఆదేశాలు జారీ చేయడంతో లేజీపే తన సర్వీస్‌ను తాత్కాళికంగా సస్పెండ్ చేయాలని నిర్ణయించుకుంది.


అర్ధనగ్న షో చేస్తున్న ఉర్ఫీ జావేద్.. క్లీన్ బౌల్డ్ అవుతున్న కుర్రకారు



Next Story

Most Viewed