రామయ్య నిత్యకళ్యాణంకు తాత్కాలిక బ్రేక్...!

by S Gopi |
రామయ్య నిత్యకళ్యాణంకు తాత్కాలిక బ్రేక్...!
X

దిశ, భద్రాచలం: భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో త్వరలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండడంతో ప్రతిరోజూ జరిగే రాములోరి నిత్య కళ్యాణం కొద్దిరోజులపాటు నిలిపివేస్తున్నట్లు దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 16 వరకు నిత్య కళ్యాణాలు నిలిపివేశారు. అదేవిధంగా ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 23 వరకు స్వామివారికి పవళింపు సేవలు కూడా నిలిపివేశారు. ఏప్రిల్ 17 నుంచి స్వామివారి నిత్య కళ్యాణాలు పునః ప్రారంభం అవుతాయని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి శివాజీ తెలిపారు.



Next Story

Most Viewed