రాయ్, రిదికి బెర్త్ కన్ఫామ్.. అతానుదాస్ మిస్

by S Gopi |
రాయ్, రిదికి బెర్త్ కన్ఫామ్.. అతానుదాస్ మిస్
X

న్యూఢిల్లీ: రానున్న ఆసియన్ గేమ్స్ ఆర్చరీ విభాగానికి సంబంధించిన ఫైనల్ సెలక్షన్స్ ట్రయల్స్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సెంటర్‌లో శనివారం జరిగాయి. ఈ పోటీల్లో టాప్ ర్యాంక్‌ అథ్లెట్ అతాను దాస్ ఆసియా గేమ్స్‌లో స్థానాన్ని దక్కించుకోలేకపోయాడు. అయితే, 2010 ఆసియన్ గేమ్స్‌లో సిల్వర్ మెడల్ సాధించిన మాజీ సర్వీసెస్ అర్చర్ తరుణ్ దీప్ రాయ్ మాత్రం ఎంపిక పోటీల్లో అద్భుత ప్రదర్శన చేసి బెర్త్ కన్ఫమ్ చేసుకున్న వారిలో మొదటి స్థానంలో నిలిచాడు. ఇక మహిళల విభాగంలో హర్యానాకు చెందిన రిది పోర్ కూడా బెర్త్ కన్ఫమ్ చేసుకుంది. చైనాలోని హాంగ్‌జు‌లో సెప్టెంబర్ 10 నుంచి 25 మధ్య ఆసియన్ గేమ్స్ జరగనున్నాయి. కాగా, ఏప్రిల్ 18 నుంచి 24 జరిగే వరల్డ్ కప్ తొలి మూడు రౌండ్స్‌లోనూ ఇదే జట్టు పాల్గొననుంది.



Next Story