మరో ఘనత సాధించిన బెజ్జూర్

by Disha Web |
మరో ఘనత సాధించిన బెజ్జూర్
X

దిశ, బెజ్జుర్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలోని గురుకుల విద్యాలయంలో టెన్త్, ఇంటర్మీడియట్ లో 100% ఉత్తీర్ణత సాధించి ఆ పాఠశాలలో విద్యను అభ్యసించిన విద్యార్థులు మండల టాపర్లుగా నిలిచారు. గురువారం తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన టెన్త్ ఫలితాలు కస్తూర్బా గాంధీ గురుకుల విద్యాలయం అభ్యసించిన 30 మంది విద్యార్థులగాను 30 మంది విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. 9.3 జీపీఏ పి. నాగమణి, బి. వేణి సాధించి టాపర్ గా నిలిచారు. ఇంటర్మీడియట్ లోనూ బెజ్జూరు మండల టాపర్ గా దన్నూరు గీత 936 మార్కులు సాధించి మండల టాపర్ గా నిలిచింది. అదేవిధంగా 20 మంది విద్యార్థులకు గాను 20 మంది ఉత్తీర్ణత సాధించి 100% ఫలితాలు సాధించారు. ఈ విజయంలో ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉందని ఉపాధ్యాయులను పలువురు అభినందిస్తున్నారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed