వీధి కుక్కల దాడిలో గొర్రె పిల్లలు మృతి

by Batti.Sumithra |

వీధి కుక్కల దాడిలో 40 గొర్రెపిల్లలు మృతి చెందాయి.

వీధి కుక్కల దాడిలో గొర్రె పిల్లలు మృతి
X

దిశ, త్రిపురారం : వీధి కుక్కల దాడిలో 40 గొర్రెపిల్లలు మృతి చెందాయి. మంగళవారం గొర్రెల కాపరులు తెలిపిన వివరాల ప్రకారం, నల్గొండ జిల్లా త్రిపురారం మండలం బాబు సాయిపేట గ్రామంలో ఈ ఘటన జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం అజిలాపురం గ్రామానికి చెందిన కౌకుంట్ల కొమురయ్య, సాయిలు, లక్ష్మయ్య, జలప్ప అనే గొర్రెల కాపరులు మేత కోసం గత మార్చి నెలలో 600 గొర్రెల మందను తీసుకుని ఇక్కడికి వచ్చారు. ఎప్పటిలాగే సోమవారం గొర్రెలను మేతకు తీసుకెళ్లగా, వాటి పిల్లలు సుమారు 50 వరకు ఉన్నాయి. వాటిని ఇనుప కంచెతో చుట్టుముట్టి ఉంచారు. అయితే, ఒక్కసారిగా వీధి కుక్కలు దాడి చేయడంతో 30 నుంచి 40 గొర్రెపిల్లలు మృతి చెందాయి. ఈ ఘటనలో దాదాపు రూ.2 లక్షల మేర నష్టం వాటిల్లిందని గొర్రెల కాపరులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. మేత కోసం ఇక్కడికి వచ్చిన తమకు ఇలాంటి నష్టం జరగడం ఎంతో బాధాకరమని తెలిపారు. అలాగే, దాతలు ఎవరైనా ముందుకు వచ్చి తమకు సహాయం చేయాలని వేడుకుంటున్నారు.

Next Story