కేసీఆర్ ఇలాకాలో భారీ అవకతవకలు.. మహిళా కౌన్సిలర్లకు దక్కని గౌరవం

by Web Desk |
కేసీఆర్ ఇలాకాలో భారీ అవకతవకలు.. మహిళా కౌన్సిలర్లకు దక్కని గౌరవం
X

దిశ, గజ్వేల్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాకా గజ్వేల్ -ప్రజాఇపూర్ మున్సిపాల్టీలో అవినీతి రాజ్యమేలుతుందట. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌లతో పాటు కమీషనర్ల త్రయం ఒక్కటై ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్నారట. తప్పుడు లెక్కలతో ఆదాయానికి గండి కోడుతున్నారట, కౌన్సిల్ సభ్యుల అభిప్రాయాలు లేకుండానే ఏకగ్రీవ తీర్మానాలతో ముగించేస్తున్నారట. స్వచర్యలకు పాల్పడుతూ వార్డుల్లో అభివృద్దిని అడ్డుకుంటున్నారట, పాలక మండలిలో మహిళ సభ్యులకు కనీస గౌరవం కరువయ్యిందని ఆవేదన పడ్డారు. ఇవన్నీ పాలక మండలిలోని కొంత మంది మహిళా కౌన్సిలర్లు మీడియా వేదికగా బహిరంగంగా చేసిన ఆరోపణలు. ఈ ఆరోపణలు అసలు వివరాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి.. గజ్వేల్ ప్రజాఇపూర్ మున్సిపాల్టీ చైర్మన్, వైస్ చైర్మన్లతో కలిపి మొత్తంగా 20 మంది కౌన్సిల్ సభ్యులు కలిగిన స్థానం.

ఈ నెల 28న మున్సిపల్ పాలకమండలి సాధారణ సమావేశం ఉదయం 11 గంటలకు నిర్వహించేందుకు 25న కౌన్సిల్ సభ్యులకు అజెండా నోటీసులను జారీ చేశారు. కాగా సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభించాల్సిన పాలక మండలి సమావేశాన్ని మధ్యాహ్నం 1 సమయంలో నిర్వహించారు. కాగా వార్డుల్లో నెలకొన్న సమస్యలపై కౌన్సిలర్ల అభిప్రాయాలను తెలుసుకోకుండానే కొంత మంది తమ అనుచర సభ్యుల మద్దతుతో తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించుకోవడంపై, చైర్మన్, వైస్ చైర్మన్, కమిషనర్ వ్యవహార శైలిపై మహిళా కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. అనంతరం మహిళా కౌన్సిలర్లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా కౌన్సిలర్లు బబ్బురి రజిత, గంగి శెట్టి చందన, గుంటుకు శిరీష, చీర్ల శ్యామల, దుంబాల లక్ష్మీ, మామిడి విద్యారాణి, వరలక్ష్మీ మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. పాలక మండలి ఏర్పాటు నుండి నేటి వరకు దాదాపుగా 530 వరకు ప్రియాంబుల్స్ ఆమోదం చేశామని వాటిని ఏ పద్దతిన కేటాయింపులు, బిల్స్ చేశారని అడిగినా అధికారులు సమాచారం ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పద్దులకు సరైన రికార్డులు, మినిట్ బుక్స్ చూపడంలో కమిషనర్ వ్యతిరేక ధోరణి అవలంభిస్తూ ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. టెండర్లు లేకుండానే చైర్మన్ పనులను తన అనుచరులకు అప్పగిస్తూ ఒంటెత్తు వ్యవహర శైలిని అవలంభిస్తూన్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి నియోజకవర్గం కారణంగా కోట్ల రూపాయల నిధులు వస్తున్నాయని, వాటి వినియోగంపై సరైన లెక్కా పత్రాలు సైతం చూపడం లేదని అన్నారు. పాలక మండలిలో మహిళా కౌన్సిలర్లను చిన్న చూపు చూస్తూన్నారని, తమకు సరైన గౌరవం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా కౌన్సిలర్లను చిన్న చూపు చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఇప్పటికైనా ఆదాయ, వ్యయాల లెక్కలను భేషరతుగా బహిరంగ పర్చాలనిటూ వారు డిమాండ్ చేశారు. కాగా గజ్వేల్ బల్దియా మహిళా కౌన్సిలర్ల మీడియా సమావేశం, ఆరోపణల అంశాలు సోషల్ మీడియాతో పాటు స్థానికంగా వైరల్‌గా మారాయి.



Next Story

Most Viewed