బస్సులోనే మహిళా కండక్టర్ మృతి

by Dishafeatures2 |
బస్సులోనే మహిళా కండక్టర్ మృతి
X

దిశ, మిర్యాలగూడ : నల్గొండ జిల్లా మిర్యాలగూడ డిపో పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న మహిళా కండక్టర్ మంగళవారం గుండెపోటుతో బస్సులోనే మృతి చెందారు. ఆర్టీసీ డిపో మేనేజర్ బొల్లెద్దు పాల్ తెలిపిన వివరాల ప్రకారం.. నాగార్జునసాగర్ నియోజకవర్గం హాలియాకు చెందిన బీ భారతి(45) ఇరవై ఏళ్లుగా ఆర్టీసీ సంస్థలో పని చేస్తుంది. మంగళవారం ఉదయం విధులకు హాజరై నల్గొండ డ్యూటీకి వెళ్ళిందన్నారు. ఈ క్రమంలో వేములపల్లి మండలం అన్నపురెడ్డిగూడెం స్టేజ్ సమీపంలో ఒక్కసారిగా ఆమె గుండె నొప్పితో బస్సులోనే కూలబడింది.

దాంతో బస్ డ్రైవర్ వెంటనే పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. కానీ భారతి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించామని తెలిపారు. మృతురాలికి భర్త నారాయణ రెడ్డి, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

అంతేకాకుండా దహన ఖర్చులకు రూ.20వేల నగదు ఇచ్చినట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ బొల్లెద్దు పాల్ పేర్కొన్నారు. గతంలో భారతి గుండెపోటుకు గురికాగా.. స్టెంట్లు అమర్చారని, ఆమె మృతి బాధాకరం అని అన్నారు. అనంతరం భారతి మృతి పట్ల ఆర్టీసీ ఉద్యోగ సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు.


Next Story

Most Viewed