హైదరాబాద్‌ సైకిలిస్ట్స్ కోసం కేటీఆర్ ట్వీట్.. నమ్మకం లేదంటున్న నెటిజన్లు

by Disha Web Desk |
హైదరాబాద్‌ సైకిలిస్ట్స్ కోసం కేటీఆర్ ట్వీట్.. నమ్మకం లేదంటున్న నెటిజన్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో : హైదరాబాద్ నగరంలో ఏదో చోట సైకిలిస్ట్స్ ప్రమాదాలకు గురవుతున్నారు. రోడ్డుకిరువైపులా సైకిలింగ్‌కు ప్రత్యేకంగా లైన్ లేకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నట్లు సైకిలిస్ట్స్ ఆరోపిస్తున్నారు. దేశంలోని వివిధ పట్టణాల్లో ఉన్న విధంగా సైక్లింగ్‌కు స్పెషల్ లైన్స్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు. అయితే, తాజాగా ఎరిక్ సోల్హిమ్ చేసిన ట్వీట్‌ను మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు. ఎరిక్ చేసిన ట్వీట్ ప్రకారం..

సైకిలర్స్‌ను సూర్యరశ్మి నుంచి రక్షించేందుకు సౌత్ కొరియాలోని రోడ్డు మధ్యలో సోలార్ ప్యానల్స్‌తో పైకప్పు నిర్మించారు. దీని ద్వారా వచ్చిన విద్యుత్తును అవసరాలకు వినియోగిస్తుంటారని ఉంది. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్.. హెచ్‌జీసీఎల్ ప్రతిపాదించిన 21 కిలో మీటర్ల సైక్లింగ్ ట్రాక్‌తో దీనిని కూడా నిర్మించుకుందాం అంటూ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ కు ట్యాగ్ చేశారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ నిర్ణయంతో నగరంలోని సైక్లిస్ట్స్ సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. అయితే, మంత్రి కేటీఆర్ ట్వీట్‌పై నమ్మకం లేదంటూ చాలా మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. గతంలోనూ.. ముంబైలో మాధిరిగా సిగ్నల్స్ పడినప్పుడు వాహనాలు హారన్ కొట్టకూడదన్న నిబంధనను హైదరాబాద్ లోనూ ఇంప్లిమెంట్ చేయాలంటూ 2020 జనవరి 31న ట్వీట్ చేశారని కానీ అది ఇప్పటి వరకూ అమలు చేయలేదని కామెంట్స్ చేశారు.

అంతేకాకుండా, రెండేళ్ల క్రితం హైదరాబాద్ లో తిరిగి డబుల్ డెక్కర్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ను కోరుతూ ట్వీట్ చేయగా.. ఇప్పటి వరకూ దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే, ఎప్పటి నుంచో స్పెషల్ లైన్ కోసం ఎదురుచూస్తున్న సైక్లిస్ట్స్ డిమాండ్‌ను తప్పనిసరిగా నెరవేర్చాలంటూ అభిప్రాయపడుతున్నారు.



Next Story

Most Viewed