అందుకే బొగ్గు కొరత.. కేంద్రంపై KTR ఫైర్

by Disha Web Desk 4 |
KTR Lashes Central Government Over Coal Shortage
X

దిశ, తెలంగాణ బ్యూరో: KTR Lashes Central Government Over Coal Shortage| NPA ప్రభుత్వంలో ప్రాథమిక ప్రణాళిక, దూరదృష్టి లేకపోవడం వల్ల దేశీయ బొగ్గు కొరత ఏర్పడిందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.10 రెట్లు ఎక్కువ ఖరీదైన బొగ్గు దిగుమతి తప్పనిసరి కాబట్టి, తదుపరిసారి మీ పవర్ టారిఫ్ పెరిగినప్పుడు, ఎవరికి కృతజ్ఞతలు చెప్పాలో మీకు తెలుసు అని ఇద్దేవా చేశారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా కేంద్రంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భారతదేశంలో 100 సంవత్సరాల పాటు ఉండే బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని పేర్కొన్నారు. కానీ కేంద్రం మాత్రం దేశీయ బొగ్గు కాకుండా ఇతర దేశాల నుంచి కొనుగోలు చేస్తుందని ఆరోపించారు.

ఇది కూడా చదవండి: కేసీఆర్ ఢిల్లీ టూర్ వెనుక అసలు వ్యూహం ఇదేనా?

Next Story