ఆ సినిమాలో తన క్యారెక్టర్ గురించి ఓపెన్ అయిన నటి.. అనుకున్న దానికంటే ఎక్కువ అంటూ

by Javid Pasha |
ఆ సినిమాలో తన క్యారెక్టర్ గురించి ఓపెన్ అయిన నటి.. అనుకున్న దానికంటే ఎక్కువ అంటూ
X

దిశ, సినిమా: బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, కృతి‌సనన్ జంటగా తెరకెక్కిన చిత్రం 'బచ్చన్ పాండే'. ఈ చిత్రాన్ని దర్శకుడు ఫర్హాద్ సమ్‌జీ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందించగా.. ఇందులో డైరెక్టర్ మైరా దేవేకర్ పాత్రలో కృతి‌సనన్ కనిపించనుంది. అయితే ఇటీవల ఓ ప్రముఖ పత్రికతో మాట్లాడిన కృతి.. తను పోషించిన క్యారెక్టర్‌పై తనకున్న అవగాహన గురించి ఓపెన్ అయింది. 'ఒక నటిగా నిర్దిష్ట సంఖ్యలో సినిమాలను పూర్తి చేసిన తర్వాత ఎవరైనా అనుకున్న దానికంటే ఎక్కువగానే నటించాలనుకుంటారు. దర్శకులు చుట్టూ ఉన్న పరిసరాలను బట్టి సినిమాను ఎలా తెరకెక్కించారో ఈ సినిమాతో అర్థమైంది. వారి దృష్టి కోణం, తీర్చిదిద్దే విధానం, నటీనటుల ప్రవర్తనలపై ఆధారపడి ఉంటుంది. ఇదంతా ప్రతిభావంతులైన డైరెక్టర్లతో పని చేసే క్రమంలో నేర్చుకున్నాను. ఒక డైరెక్టర్ సెట్‌లో అన్ని కంట్రోల్ చేస్తూ కెప్టెన్ ఆఫ్ ది షిప్‌గా ఉంటారు. కాబట్టి దర్శకత్వం నేర్చుకోవడం సులభమే అనిపించింది'అని చెప్పిన నటి.. ఒక రకంగా 'మిమి'లో చేసిన పాత్రనే బచ్చన్‌పాండేలో 'మైరా' క్యారెక్టర్ పోషించడానికి స్ఫూర్తి‌నిచ్చినట్లు తెలిపింది.



Next Story

Most Viewed