హుజూరాబాద్‌లో హోర్డింగ్‌ల కలకలం.. ఈటల వర్సెస్ కౌశిక్ రెడ్డి

by Disha Web Desk |
హుజూరాబాద్‌లో హోర్డింగ్‌ల కలకలం.. ఈటల వర్సెస్ కౌశిక్ రెడ్డి
X

దిశ, హుజూరాబాద్ రూరల్: ఉప ఎన్నికలతో వేడిక్కిన హుజూరాబాద్.. నేటికీ అదే హీట్‌లో రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఈటల రాజేందర్ వర్సెస్ పాడి కౌశిక్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల హుజూరాబాద్ అభివృద్ధిపై సవాళ్లు చేసుకున్న నేతలు.. తాజాగా హోర్డింగ్‌లు ఏర్పాటు చేయడం నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. హుజరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ కూడలి వద్ద 'హుజరాబాద్ అభివృద్ధిపై ప్రజల సమక్షంలో చర్చకు ఈటల సిద్ధమా..' అంటూ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి బుధవారం పెద్ద ఎత్తున హోర్డింగ్‌లకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ అంశం ప్రజల్లో చర్చకు దారి తీసింది. ఇంతకూ ఈటల రాజేందర్ చర్చకు వస్తారా.. లేదా అని ప్రజలు చర్చించుకుంటున్నారు.


Next Story

Most Viewed