ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులు పెంపు.. ప్రకటించిన మంత్రి..

by Dishafeatures2 |
ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులు పెంపు.. ప్రకటించిన మంత్రి..
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులను పెంచుతున్నట్లు విద్యాశాఖ మంత్రి ప్రకటించారు. ఈ ఫీజులు విద్యా సంవత్సరం 2022-23 నుంచి అమల్లోకి రానున్నాయని తెలిపారు. ఈ మేరకు కర్ణాటక విద్యాశాఖ మంత్రి సీఎన్ అశ్వత్ నారాయన్ గురువారం వెల్లడించారు. 'రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులను 10 శాతం పెంచనున్నాం. అయితే విద్యాసంస్థలు ఫీజుల పెంపు విషయంలో డిమాండ్ చేసిన 25 శాతం బదులుగా 10 శాతం ఫీజులు పెంచుతున్నాం. దాంతో పాటుగా రాష్ట్రంలోని మెడికల్ ఇంజనీరింగ్ కాలేజీలు, డెంటల్ కన్సార్టియం కాలేజీలను విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇది వచ్చే ఏడాది అమలు కానుంది' అని అశ్వథ్ తెలిపారు. అయితే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, కర్ణాటక ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల అసోసియేషన్ మధ్య జరిగిన సమావేశంలో నిర్ణయం వెల్లడించారు. ఫీజులను 10 పెంచుతున్నట్లు ఓ ఒప్పందం చేసుకున్నట్లు మంత్రి కార్యాలయం వెల్లడించింది. ఈ ఫీజులు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లోని ప్రభుత్వ సీట్లు పొందిన విద్యార్థులకు వర్తిస్తాయని తెలిపారు.


Next Story

Most Viewed