- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- వైరల్
- పర్యాటకం
- టెక్నాలజీ
- Telugu News
- IPL2023
కర్ణాటక సీఎం బొమ్మైకి కరోనా.. ఢిల్లీ పర్యటన రద్దు
by Disha Web Desk 7 |

X
బెంగళూరు: కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా శనివారం వెల్లడించారు. మధ్యస్థ లక్షణాలతో ఉన్న ఆయన కోవిడ్ టెస్టు చేయించుకోగా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. 'నాకు మధ్యస్థ లక్షణాలతో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఇంట్లోనే హోం ఐసోలేషన్‌లో ఉన్నాను. గత కొన్ని రోజులుగా నాకు దగ్గరగా ఉన్నవారు పరీక్ష చేయించుకుని, ఐసోలేషన్‌లో ఉండండి. కరోనా కారణంగా ఢిల్లీ పర్యటన రద్దైంది' అని ట్వీట్లో పేర్కొన్నారు. కాగా ఆదివారం ప్రధాని మోడీ నేతృత్వంలో నీతి ఆయోగ పాలక విభాగం సమావేశం, అజాదీ కా అమృత్ మహోత్సవ్ జాతీయ కమిటీ మూడో సమావేశానికి ఆయన వెళ్లాల్సి ఉంది. కరోనా నిర్ధారణ కావడంతో ఆయన పర్యటన రద్దైంది. శుక్రవారం పలు సమావేశాల్లో పాల్గొన్నారు.
Next Story