కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం

by Gopi |
కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయం వద్ద పురుగుల మందు తాగి ప్రేమికులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఘన్పూర్ గ్రామానికి చెందిన స్నేహ, నందీశ్వర్ లు ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు ఎవరైనా అడ్డు చెప్పి ఉండొచ్చని.. అందుకే వీరు ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చు అని అంటున్నారు. ఈ ఘటనలో స్నేహ అక్కడిక్కడే మృతి చెందింది. నందీశ్వర్ ను కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story