ఆ బేబీ పౌడ‌ర్‌తో క్యాన్స‌ర్‌.. 2023 నుండి ఆపేస్తున్నామంటూ కంపెనీ ప్ర‌క‌ట‌న‌!

by Disha Web Desk 20 |
ఆ బేబీ పౌడ‌ర్‌తో క్యాన్స‌ర్‌.. 2023 నుండి ఆపేస్తున్నామంటూ కంపెనీ ప్ర‌క‌ట‌న‌!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః అంత‌ర్జాతీయంగా మోస్ట్ పాపుల‌ర్ బేబీ పౌడ‌ర్ జాన్సన్ & జాన్సన్‌కు కాలం చెల్లింది. యుఎస్ ఫార్మాస్యూటికల్ దిగ్గజం జాన్సన్ & జాన్సన్, 2023 నుండి ప్రపంచవ్యాప్తంగా త‌న‌ వివాదాస్పద టాల్క్ ఆధారిత బేబీ పౌడర్ అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. రెండు సంవ‌త్స‌రాల క్రిత‌మే USA, కెనడాలో J&J తన విక్రయాలను నిలిపియ‌గా, తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఈ బేబీ పౌడ‌ర్ విక్రయాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటన వెలువడింది. అయితే, ఈ టాల్క్ ఆధారిత పౌడర్‌ల నుండి కొత్త‌గా కార్న్‌స్టార్చ్ ఆధారిత బేబీ పౌడర్‌కు మారుతున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

కొన్నేళ్లుగా, J&J టాల్కమ్ పౌడర్‌లు, ముఖ్యంగా బేబీ పౌడర్‌లు క్యాన్సర్‌కు కారణమయ్యే కార్సినోజెనిక్ పదార్థాలను క‌లిగి ఉన్నాయ‌నే ఆరోప‌ణ‌ల‌ను ఎదుర్కొంటూ, వివాదాస్పదంగా మారింది. దీనికి సంబంధించి, వినియోగదారులతో పాటు, ఈ పౌడ‌ర్‌ను ఉపయోగించడం వల్ల నష్టపోయిన వారి నుండి 38 వేల‌కు పైగా వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఒకానొక స‌మ‌యంలో కంపెనీ అలాంటిదేమీ లేద‌ని బుకాయించిన‌ప్ప‌టికీ, అంత‌ర్గ‌తంగా తాము క్యాన్స‌ర్ ఆధారిత ప‌దార్థాల‌ను ఉప‌యోగిస్తున్న‌ట్లు ఒప్పుకున్నారు. ఈ నేప‌ధ్యంలో తాజా ప్ర‌క‌ట‌న వెలువ‌డింది.

ఇవి కూడా చ‌ద‌వండి: 18 ఏళ్లకే పక్కలోకి రమ్మన్నారు వేధింపులు తట్టుకోలేకపోయా!



Next Story

Most Viewed