కళ్యాణమహోత్సవంలో అవమానించారు: జోగిని శ్యామల నిరసన

by Disha Web |
కళ్యాణమహోత్సవంలో అవమానించారు: జోగిని శ్యామల నిరసన
X

దిశ, ఖైరతాబాద్: శ్రీ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణమహోత్సవంలో అమ్మవారి దర్శనం కల్పించకుండా ఆలయ ఈఓ అన్నపూర్ణ తమను అవమానించారని జోగిని శ్యామల ఆరోపించారు. గురువారం ఆలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అమ్మవారి కళ్యాణమహోత్సవం సందర్భంగా ఆలయంలో ఈఓ తమను చిన్న చూపు చూశారని అసహనం వ్యక్తం చేశారు. తమకు బోనాల కాంప్లెక్స్‌లో మంగళ, శుక్ర, ఆది వారాలలో దర్శనంతో పాటు పూజల కొరకు ప్రత్యేక గదులు కేటాయించాలని డిమాండ్ చేశారు. తమకు సౌకర్యాలు కేటాయించకపోతే ఆలయం ఎదుట తమ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టనున్నట్లు ఆమె హెచ్చరించారు. ఎస్ఆర్ నగర్ సీఐ సైదులు వారి డిమాండ్లను మంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed