సచిన్ రికార్డును అతడు బద్దలు కొడతాడు: వసీం జాఫర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Disha Web Desk 19 |
సచిన్ రికార్డును అతడు బద్దలు కొడతాడు: వసీం జాఫర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్, ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జో రూట్‌పై ప్రశంసలు కురిపించాడు. జాఫర్ మాట్లాడుతూ.. టెస్టు క్రికెట్‌లో సచిన్ 15,921 పరుగుల రికార్డును జో రూట్ బద్దలు కొట్టగలడంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. రూట్ వయస్సు ప్రస్తుతం 31 సంవత్సరాలు.. అతడు మరో ఐదు, ఆరు సంవత్సరాలు టెస్టు క్రికెట్ ఆడితే సచిన్ రికార్డ్‌ను బ్రేక్ చేయగలడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇటీవల టెస్టుల్లో రూట్ అద్భుతంగా రాణిస్తున్నాడని పేర్కొన్నారు. ఇంగ్లాండ్ విజయాల్లో అతడు కీలక పాత్ర పోషిస్తున్నాడనడంలో ఏలాంటి సందేహం లేదని అన్నారు.

కాగా, ఇండియా, ఇంగ్లాండ్‌ల మధ్య ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరిగిన రీషెడ్యూల్ టెస్టులో రూట్ అద్భుత ప్రదర్శన చేశాడు. కీలక సమయంలో జట్టును ఆదుకుని.. మెరుపు సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఓటమి దిశగా సాగుతున్న జట్టుకు చారిత్ర్మాక విజయానందించాడు. ఇంగ్లాండ్ జట్టు చరిత్రలోనే అత్యధిక పరుగులను ఛేజ్ గెలవడంలో రూట్ కీలక పాత్ర పోషించాడు. ఓపికతో బౌలర్లను ఎదుర్కొని సెంచరీ చేసిన రూట్ బ్యాటింగ్‌పై ప్రశంసల వర్షం కురుస్తుంది. జో రూట్ తన అద్భుత ప్రదర్శనతో చాలా ఏళ్లుగా ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ నెగ్గాలన్న భారత్ కలకు బ్రేక్ వేశాడు. కాగా రూట్ 121 టెస్టుల్లో 10, 458 పరుగులు చేశాడు.


Next Story

Most Viewed