సెరీనా&వీనస్ విలియమ్స్‌కు క్షమాపణలు చెప్పిన డైరెక్టర్

by Disha Web Desk 17 |
సెరీనా&వీనస్ విలియమ్స్‌కు క్షమాపణలు చెప్పిన డైరెక్టర్
X

దిశ, సినిమా: ఫిల్మ్ మేకర్ జేన్ కాంపియన్ టెన్నిస్ లెజెండ్స్ వీనస్ విలియమ్స్, సెరీనా విలియమ్స్‌కు క్షమాపణలు చెప్పింది. క్రిటిక్స్ చాయిస్ అవార్డ్స్ యాక్సెప్టెన్స్ స్పీచ్‌లో భాగంగా వీరిద్దరిపై కామెంట్స్ చేసిన ఆమె తప్పును ఒప్పుకొంది. ప్రసంగంలో భాగంగా..'వీసన్ అండ్ సెరీనా మీరు అద్భుతం కావొచ్చు కానీ నాలాగా పురుషులతో పోరాడి గెలవలేదు' అని స్టేట్మెంట్ ఇచ్చింది. అయితే ఈ వ్యాఖ్యలపై ఓ వర్గం నుంచి విమర్శలు ఎదుర్కొంది జేన్ కాంపియన్. దీంతో.. 'సెరీనా అండ్ వీనస్ విలియమ్స్ అచీవ్‌మెంట్స్‌పై థాట్‌లెస్ కామెంట్స్ చేశా. ఈ లెజెండరీ బ్లాక్ ఉమెన్, వర్డ్ క్లాస్ అథ్లెట్స్‌ను అగౌరవపరచడం నా ఉద్దేశం కాదు. వాస్తవానికి విలియమ్స్ సోదరీమణులు కోర్టులో పురుషులకు వ్యతిరేకంగా పోరాడారు. వారి సక్సెస్‌తో మహిళలకు సాధ్యం కానిది లేదని చూపించారు' అని అపాలజీ స్టేట్మెంట్‌లో పేర్కొంది.


Next Story

Most Viewed