నన్ను ఎదుర్కోలేకే.. బయటకు పంపారు : ఈటల

by Disha Web Desk |
నన్ను ఎదుర్కోలేకే.. బయటకు పంపారు : ఈటల
X

దిశ, తెలంగాణ బ్యూరో : తనను అసెంబ్లీకి రానియొద్దని కావాలనే సీఎం కేసీఆర్ బీజేపీ ఎమ్మెల్యేలను బయటకు పంపించారని, తనను ఎదుర్కోలేకే బయటికి గెంటేశారని హుజురాబాద్​ఎమ్మెల్యే ఈటల రాజేందర్​అన్నారు. ఈ బడ్జెట్​సమావేశాలకు సస్పెన్షన్​వేటు పడిన అనంతరం ఈటల శామీర్​పేటలో సోమవారం మీడియాతో మాట్లాడారు. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంలేదని నిరసన తెలపడం తప్పా అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో తమను రానివ్వకుండా చేస్తే ప్రజా క్షేత్రంలోకి వెళ్లి ప్రభుత్వ మొండి వైఖరిని ఎండగడుతామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ను బొందపెడుతామని ఈటల ఫైరయ్యారు. అక్రమంగా అరెస్ట్ చేసి స్టేషన్ లో పడేశారని ధ్వజమెత్తారు. ఇంత దారుణంగా ప్రతిపక్షాల గొంతునొక్కడం అందరూ చూస్తున్నారన్నారు. తమతో పాటు సభలో భట్టి కూడా ఉన్నాడని, అయితే కేవలం తమను మాత్రమే సభ నుంచి గెంటేశారన్నారు. తాము సీట్లలో నుంచి లేస్తేనే తప్పయిందా అంటూ ప్రశ్నించారు. ట్రిపుల్​ఆర్​అంటే ముఖ్యమంత్రికి భయం మొదలైందన్నారు.

ఇదిలా ఉండగా బడ్జెట్​సమావేశాల ప్రారంభోత్సవం సందర్భంగా గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై గన్ పార్క్ వద్ద బీజేపీ ఎమ్మెల్యేలు, రఘునందన్ రావు, రాజాసింగ్, ఈటల రాజేందర్, ఇతర నాయకులు గన్​పార్క్​అమరవీరుల స్తూపం వద్ద నల్ల కండువాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. 40, 50 ఏండ్లు నుంచి వస్తున్న సంప్రదాయాలను తుంగలో తొక్కి తెలంగాణలో కేసీఆర్ కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు. స్పీకర్ కుర్చీని అడ్డం పెట్టుకొని తమ గొంతు నొక్కేందుకు మైకులు కట్ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్​ఎమ్మెల్యేలు కొద్దిమంది ఉన్నా గత ప్రభుత్వాలు మాట్లాడే అవకాశం కల్పించాయని, అయితే స్వరాష్ట్రంలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడంలేదని అన్నారు. అసెంబ్లీలో అడుగుపెట్టేది ఇప్పుడు ముగ్గురమే కావచ్చిని, కానీ భవిష్యత్​లో బీజేపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తంచేశారు.

టీఆర్ఎస్​నుంచి బయటకు వచ్చిన ఈటల హుజురాబాద్ బైపోల్​లో గెలిచి మొదటిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అయితే ఆయన ఇంటి నుంచి బయలుదేరే మొదలు నుంచి అసెంబ్లీకి చేరే వరకు పోలీసులు ఆంక్షలు విధించారు. ఆయన కారు మినహా ఇతరులు కాన్వాయ్​ద్వారా వెళ్లకూడదని మేడ్చల్​పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ ప్రభుత్వ నియంతృత్వం, పోలీసుల తీరుపై హుజురాబాద్​ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తమన నాయకుడి దగ్గరుండి అసెంబ్లీకి పంపుదామనుకుంటే అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్బంధానికి తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.

బంగారు కాదు.. మత్తు తెలంగాణ : రాజాసింగ్​

కొట్లాడి సాధించిన రాష్ట్రం బంగారు తెలంగాణ కాకుండా కేసీఆర్​హయాంలో మత్తు తెలంగాణగా మారిందని గోషామహల్​ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మహిళ అని కూడా చూడకుండా గవర్నర్ ను అవమానించారన్నారు. తమ నేతలను ఓడించేందుకు కేసీఆర్ ధన బలాన్ని, అధికార బలాన్ని వాడుకున్నారని ఆరోపించారు. అయినా అంతిమంగా దుబ్బాక, హుజురాబాద్​లో విజయం బీజేపీకే వరించిందన్నారు. బీజేపీ నుంచి ఒక్క ఎమ్మెల్యే స్థానం నుంచి తాము మూడు స్థానాలకు వచ్చామన్నారు. అసెంబ్లీలో తమ గళాన్ని నొక్కివేయలని చూస్తున్నారని ప్రభుత్వంపై ఫైరయ్యారు. తమను ఈ అసెంబ్లీ సెషన్​మొత్తానికే సస్పెండ్​చేయడం ప్రజాస్వామ్యానికి చీకటి రోజని ఆయన తెలిపారు. ఇది ముఖ్యమంత్రి రాజకీయ కుట్రలో భాగమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసనకు కూడా అవకాశం ఇవ్వలేదని పేర్కొన్నారు. తమ హక్కును హరించే అవకాశం ఈ సీఎంకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను కూడా చూడకూండా తమను అసెంబ్లీ ఆవరణలో పోలీసులు ఏవిధంగా అరెస్ట్​చేస్తారని ఫైరయ్యారు. దేవాలయం లాంటి అసెంబ్లీని కూడా పోలీసులతోనే నడపుతున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణాలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని నడవనీయమని ఆయన హెచ్చరించారు. కేసీఆర్​ప్రభుత్వానికి టై దగ్గరపడిందని రాజాసింగ్​హెచ్చరించారు.

రాబోయే ఎన్నికల బడ్జెట్ ఇది : రఘునందన్ రావు

టీఆర్ఎస్​ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్​రాబోయే ఎన్నికల బడ్జెట్​అని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు అన్నారు. కేసీఆర్​రాజ్యాంగ విలువలను తొక్కేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లో నుంచే పోలీసులు తమ వాహనాలను డైవర్ట్ చేశారని, ఇదెక్కడి న్యాయమని ఆయన ప్రశ్నించారు.


Next Story

Most Viewed