వెటర్నరీ ఆఫీస్‌ను పట్టించుకునే నాథుడే లేడా..?

by Jakkula.Mamatha |

వేళకు రారు.. వచ్చిన అందుబాటులో ఉండరు.

వెటర్నరీ ఆఫీస్‌ను పట్టించుకునే నాథుడే లేడా..?
X

దిశ, మంథని: వేళకు రారు.. వచ్చిన అందుబాటులో ఉండరు. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో ఉన్న ప్రాంతీయ పశు వైద్యశాల కార్యాలయం మూసి ఉంది. అధికారులు సిబ్బంది ఎవరు కూడా అందుబాటులో లేరు. అలా వచ్చి.. ఆఫీస్ డోర్ తీసి బయట గేటు దగ్గరకు వేసి వెళ్లారు. అధికారులు గాని సిబ్బంది గాని ఎవరు అందుబాటులో లేకపోవడంతో పని నిమిత్తం ఆఫీస్ కు వచ్చే వారు వెనుదిరిగి వెళ్లిపోతున్నారు. కాగా ముందు నుంచి కూడా ఈ పశు వైద్యశాల దుస్థితి ఇలాగే తయారైందని అంటున్నారు స్థానికులు. అయితే ప్రభుత్వం జీతాలు ఇచ్చినప్పటికీ కూడా అధికారులు సిబ్బంది అందుబాటులో ఉండటం లేదని సమయపాలన పాటించడం లేదన్న ఆరోపణలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. దీంతో మంథని ప్రాంతీయ పశు వైద్యశాలను పట్టించుకునే నాథుడే లేడా..? అన్న విమర్శలు కూడా ప్రజా సంఘాల నుంచి వినిపిస్తున్నాయి. కాగా ఇక్కడ ఇంచార్జ్ గా పని చేసిన అధికారిణి బదిలీపై వెళ్లారు.

Next Story