- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫైలింగ్ విధానం బాగుంది : పంచాయతీరాజ్ అదనపు కమిషనర్
వివిధ పనుల కోసం 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఫైలింగ్ నిర్వహించడం అభినందనీయమని పంచాయతీరాజ్ అదనపు కమిషనర్ రవీందర్ రావు ప్రశంసించారు.

దిశ, భిక్కనూరు : వివిధ పనుల కోసం 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఫైలింగ్ నిర్వహించడం అభినందనీయమని పంచాయతీరాజ్ అదనపు కమిషనర్ రవీందర్ రావు ప్రశంసించారు. మంగళవారం ఆయన కామారెడ్డి జిల్లా భిక్కనూరు, రామేశ్వర్‌పల్లి గ్రామపంచాయతీలను సందర్శించి, ఎంపీడీవో కార్యాలయంలో కంప్యూటర్ ముందు కూర్చొని రికార్డుల్లో నమోదైన వివరాలకు అనుగుణంగా బిల్లులు సక్రమంగా ఉన్నాయా లేదా అన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.
ప్రతి ఖర్చుకు సంబంధించిన వివరాలను, కంప్యూటర్‌లో అప్‌లోడ్ చేసిన బిల్లులతో సరిపోల్చి స్వయంగా ధృవీకరించారు. ప్రతి గ్రామపంచాయతీలో ఇదే విధంగా రికార్డులను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. సుమారు గంటపాటు రికార్డులు, బిల్లులను నిశితంగా పరిశీలించిన అనంతరం వాటి నిర్వహణ పద్ధతి సంతృప్తికరంగా ఉందని పేర్కొంటూ సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి మురళి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజ్‌కిరణ్ రెడ్డి, ఆయా గ్రామపంచాయతీల కార్యదర్శులు కొరోళ్ల మహేశ్ గౌడ్, శ్యామ్‌తో పాటు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.






