ITBP SI స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు.. రూ. లక్షకు పైగా జీతం

by Disha Web Desk 17 |
ITBP SI స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు.. రూ. లక్షకు పైగా జీతం
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) సబ్ ఇన్‌స్పెక్టర్ (స్టాఫ్ నర్స్) పోస్టుల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 18 ఖాళీలను నోటిఫికేషన్‌లో పేర్కొంది. అర్హులైన అభ్యర్థులు త్వరగా అప్లై చేసుకోవాలని అధికారులు తెలిపారు.

మొత్తం పోస్ట్‌‌లు: 18

పోస్ట్ పేరు: సబ్ ఇన్‌స్పెక్టర్ (SI-స్టాఫ్ నర్సు)

అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2 ఇంటర్మీడియట్, సెంట్రల్/ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్టర్ చేయబడిన జనరల్ నర్సింగ్ మిడ్‌వైఫరీ పరీక్షలో ఉత్తీర్ణత.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 17 ఆగస్టు 2022.

చివరి తేదీ: 15 సెప్టెంబర్ 2022.

వయస్సు: 21 నుంచి 30 సంవత్సరాలు.

పే స్కేల్: రూ. 35,400 – రూ. 1,12,400.

దరఖాస్తు ఫీజు:

Gen/OBC/EWS అభ్యర్థులకు రూ. 200.

SC/ST/మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్ https://www.itbpolice.nic.in/indexenglish.html లేదా http://www.davp.nic.in/WriteReadData/ADS/eng_19143_10_2223b.pdf ను చూడగలరు.


Next Story