తక్కువ జీతాలకు నిరసనగా సెలవులు తీసుకున్న ఇండిగో ఉద్యోగులు.!

by Disha Web Desk 17 |
తక్కువ జీతాలకు నిరసనగా సెలవులు తీసుకున్న ఇండిగో ఉద్యోగులు.!
X

న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగోలోని మెయింటెనెన్స్ టెక్నిషియన్స్ సిబ్బంది అనారోగ్యం కారణాలతో సెలవులో ఉన్నారని సంస్థలోని వర్గాలు వెల్లడించాయి. గత రెండు రోజులుగా హైదరాబాద్, ఢిల్లీల్లోని సంస్థ టెక్నికల్ సిబ్బంది తక్కువ జీతాలను నిరసిస్తూ నిరసనగా సెలవులు తీసుకున్నారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల ప్రారంభంలో సంస్థ దేశీయ విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. చాలామంది టెక్నికల్ విభాగంలోని క్యాబిన్ సిబ్బంది అనారోగ్య సెలవులో ఉండటం వల్లే ఈ సమస్య తలెత్తిందని సమాచారం. అయితే, ఈ వ్యవహారానికి సంబంధించి స్పందించేందుకు సంస్థ అధికారులు నిరాకరించారు. సెలవులు తీసుకున్న చాలామంది సిబ్బంది ఎయిర్ఇందియా రిక్రూట్‌మెంట్ కోసం వెళ్లారని పరిశ్రమ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. ఇదివరకు కరోనా మహమ్మారి పరిస్థితుల కారణంగా ఇండిగో సంస్థ తన ఉద్యోగుల జీతాల్లో కోత విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల ఎయిర్ఇండియాను సొంతం చేసుకున్న టాటా గ్రూప్, కొత్తగా ప్రారంభం కానున్న ఆకాశ ఎయిర్ సంస్థలు నియామకాల ప్రక్రియ ప్రారంభించాయి. దీంతో చాలామంది ఉద్యోగులు ఆయా సంస్థల్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

Next Story

Most Viewed